Published 19:46 IST, September 4th 2020
Teachers' day wishes in Telugu you can send to your teachers and mentors
Teachers' day wishes in Telugu you can send to your teachers and mentors on September 5 on the occasion of teachers' day. Read on to know.
Advertisement
Teachers' day is celebrated in India to honour teachers and show them how much their students appreciate them for their contributions in the community. Teachers' day is celebrated every year on September 5th to mark the birthday of Dr. Sarvepalli Radhakrishnan who was the first Vice President of India and his contribution to the field of education in India. Here are some teacher’s day wishes in Telugu for you to send to your teachers.
Teachers' day wishes in Telugu
మీరు చేసిన మార్గనిర్దేశం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. మీ వల్లే నా కలలను నిజం చేసుకోగలిగాను. ఈ విషయంలో మీ రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నా జీవితాన్ని అద్భుతంగా ఉండేలా తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. హ్యపీ టీచర్స్ డే.
మీ శక్తిని, సమయాన్ని మా కోసం ఖర్చు చేసినందుకు, మమ్మల్ని తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు. హ్యపీ టీచర్స్ డే.
Read Also | Sena Denies Sanjay Raut Threatened Kangana, Cries Conspiracy To 'tarnish' Mumbai's Image
గౌరవనీయులైన ఉపాధ్యాయుడికి, మీరు నా కోసం చేసిన కృషికి ధన్యవాదాలు. నన్ను మనిషిలా మార్చినందుకు, నా కెరీర్‌ను తీర్చిదిద్దినందుకు మన:పూర్వక ధన్యవాదాలు. మీకివే నా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రేమతో మీరు తీర్చిదిద్దిన విద్యార్థి.
మేడమ్.. మీరు చాలా గొప్ప టీచర్. చదువు మీద ఆసక్తి పెంచుకొనేలా నన్ను ప్రోత్సహించారు. నా భవిష్యత్తును ముందే ఊహించి నాకు మార్గదర్శిగా నిలిచారు. అనునిత్యం నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. మీకు ధన్యవాదాలు చెప్పడం తప్ప మరేమీ చేయలేకపోతున్నా. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
‘‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర: గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమ’’.. ఈ ప్రపంచంలో గురువే సమస్తం. విద్యాబుద్ధులు నేర్పి.. మన ఎదుగుదలకు తోడ్పడే గురువులకు మనం ఎంతిచ్చినా రుణం తీర్చుకోలేం. మనం ప్రయోజకులమై ఉన్నత స్థానాలను అధిరోహించడమే అసలైన గురుదక్షిణ.
సెప్టెంబరు 5, ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో.. ఈ కొటెషన్లతో శుభాకాంక్షలు తెలుపుకుందామా!
నా ఎదుగుదలనే గురుదక్షిణగా భావించే నా ప్రియమైన గురువుగారికి..
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
బడి, బాధ్యత, భవిష్యత్తుని పరిచయం చేసిన మా గురువులకి..
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
చదివి అర్థం చేసుకున్నప్పుడే దానికి విలువ. లేకపోతే అట్టి చదువరికి, చెదపురుగుకు తేడా లేదు.
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
ఉత్తమమైన వ్యక్తిని తయారు చేయడమే విద్య పరమార్థం.
అది గొప్ప ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది.
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
మార్చలేని గతం గురించి ఆలోచించకుండా
చేతిలో ఉన్న భవిష్యత్తు కోసం శ్రమించు.
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే.. దానికి ఆధారమైన దారం గురువు.
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
ఈ ప్రపంచానికి మీరు కేవలం ఉపాధ్యాయులే కావచ్చు. మాకు మాత్రం మీరే కథానాయకులు.. మీరే, మా ప్రేరణ!
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో..
భూమిని చూసి ఓర్పును నేర్చుకో...
చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో..
ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో..
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
శిష్యుల ఎదుగుదలే గురు దక్షిణగా భావించే పూజ్యులైన గురువుగారికి..
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర:
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురువేనమ:
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
ఈ ప్రపంచంలో ఎన్ని వందల వృత్తులు ఉన్నా.. వారందరినీ తయారు చేసే వృత్తి ఉపాధ్యాయ వృత్తి. అందుకే ఆ వృత్తి అంటే నాకు ఎంతో గౌరవం - అబ్దుల్ కలాం
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
విద్యార్థి జీవితాన్ని మలిచేది గురువే
- ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు
స్థిరత్వం లేని నిలకడ లేని నా ఆలోచనలకు ఓ రూపాన్ని కల్పించి నా గమ్యాన్ని నేను గుర్తించేలా చేసి.. దాన్ని చేరుకునేలా ప్రోత్సహించిన నా గురువుకు ధన్యవాదాలతో పాటు టీచర్స్ డే శుభాకాంక్షలు.
పుస్తకాల్లో ఉన్న పాఠాలతో పాటు జీవితానికి అవసరమైన పాఠాలు కూడా మీరు నేర్పించారు. బహుశా ఉపాధ్యాయుడికి సంతృప్తినిచ్చే విషయం అదేనేమో. మీరు నేర్పించిన క్రమశిక్షణ, సమయపాలన ఇప్పటికీ మీరు నా వెన్నంటి నడిపిస్తున్నారేమో అనే భావన కలిగిస్తున్నాయి. నన్ను సరైన మార్గంలో పెట్టిన మీకు ధన్యవాదాలు.
నచ్చిన టీచర్ మనకు పాఠాలు చెబుతుంటే.. క్లాస్ రూం ఇల్లుగా మారిపోతుందట. ఆ ఇంటిని నేను ఇప్పుడు మిస్సవుతున్నాను. థ్యాంక్యూ మాస్టారు.
మీ నుంచి నేర్చుకున్నాం. మీరు చెప్పినవి విన్నాం. మిమ్మల్ని చూస్తూ పెరిగాం. అప్పుడప్పుడూ మిమ్మల్ని చూసి నవ్వాం. మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందాం. మా జీవితంలో మీ కంటే పెద్ద హీరో మరెవ్వరూ లేరు. మీ శక్తిని మాకు ధారపోసి మమ్మల్ని తీర్చిదిద్దినందుకు ధన్యవాదాలు.
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఎంత రుణపడి ఉన్నానో.. ఆ జన్మను సార్థకం చేసుకునేలా నన్ను తీర్చిదిద్దిన మీకు కూడా అంతే రుణపడి ఉన్నాను. అలెగ్జాండర్ ది గ్రేట్ చెప్పిన ఈ మాట నేను మీకు చెబుతున్నాను. హ్యాపీ టీచర్స్ డే.
నిస్వార్థమైన మీ మనసుకి, విద్యార్థులను గొప్పవారిగా తీర్చిదిద్దాలనే మీ తపనకు సదా కృతజ్ఞులై ఉంటాం. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
Image credits: Shutterstock
17:59 IST, September 4th 2020